Western Ghats Spatial Decision Support System [WGSDSS]
Ecologically Sensitive Regions in the Western Ghats
T V Ramachandra, Bharath Setturu, Vinay S, MD Subash Chandran, Bharath H. Aithal
Energy and Wetlands Research Group (EWRG), Environment Information System (ENVIS),
Center for Ecological Sciences (CES), Indian Institute of Science (IISc),
Tel: 080-22933099 / 22933503 / 23608661
Email: tvr@iisc.ac.in, envis.ces@iisc.ac.in

పశ్చిమ కనుమల ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థను

ముఖ్యాంశాలు

• పర్యావరణ సున్నితత్వం ఆధారంగా ప్రాంతాలను దృశ్య రూపంలో తీర్చిదిద్దడంలో సహాయ పడుతుంది.
• పర్యావరణ సున్నితత్వాన్ని లెక్కించడానికి ఉపయోగించే “వేరియబుల్స్”ని దృశ్య రూపంలో చూపిస్తుంది.
• గ్రిడ్ స్థాయి (5' * 5 ' లేదా 9 కిలోమీటర్లు * 9 కిలోమీటర్లు) మరియు గ్రామ స్థాయిలలో లభిస్తుంది.
• వికేంద్రీకృత స్థాయిలలో (బిఎంసి, స్థానిక అటవీ శాఖ మొదలైనవి) నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది

పశ్చిమ కనుమల ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థను (డబ్ల్యు. జి. ఎస్. డి. ఎస్. ఎస్) పశ్చిమ కనుమలలో కొనసాగుతున్న పర్యావరణ పరిశోధనలో భాగంగా రూపొందించబడింది. ఈ వ్యవస్థ ఇటీవలి సమాచారం మరియు ఓపెన్ సోర్స్ పరిజ్ఞానాల పురోగతిని ఉపయోగించుకొని ప్రాదేశిక మరియు ఇతర సమాచారంతో (జీవ, భౌగోళిక, వాతావరణ, పర్యావరణ, మరియు సామాజిక ఆధారిత) ఏకీకరించబడినది. ఇది సామాజిక అవసరాలను తీర్చడంతో పాటు పాలన పారదర్శకతను పెంచుతుంది, అలాగే పర్యావరణపరంగా మరియు జలసంబంధంగా కీలకమైన సహ్యాద్రి కొండ శ్రేణుల యొక్క వివేకవంతమైన నిర్వహణకు సహాయపడుతుంది. అందుబాటులో ఉన్న పర్యావరణ సంబంధిత సున్నిత ప్రాంతాల వికేంద్రీకృత స్థాయి (గ్రిడ్ / గ్రామం) దృశ్య వ్యవస్థ ద్వారా సమాచార సంశ్లేషణ మరియు ఏకీకరణ ద్వారా ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సహజ వనరుల సుస్థిర నిర్వహణ దిశగా వికేంద్రీకృత స్థాయిలో (జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు - బిఎంసి) సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి చాలా అవసరం.

వెబ్ ఆధారిత ప్రాదేశిక నిర్ణయం మద్దతు వ్యవస్థ (డబ్ల్యు. జి. ఎస్. డి. ఎస్. ఎస్) ను ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ (జియోసర్వర్, పోస్ట్ జిఆర్ఇ ఎస్క్యూఎల్, జియో టూల్స్, ఓపెన్ లేయర్స్) మరియు ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియం (ఓ.జి.సి.) ప్రమాణాల యొక్క ప్రాదేశిక సమాచారాన్ని ఏకీకృతం చేసి బహుళ ప్రమాణాల విశ్లేషణను నిర్వహించడానికి సమగ్రపరచడం ద్వారా రూపొందించబడింది. ఈ వ్యవస్థలోని సర్వీసులైన వెబ్ మ్యాప్ సర్వీస్ (డబ్ల్యుఎంఎస్) మరియు వెబ్ ఫీచర్ సర్వీస్ (డబ్ల్యుఎఫ్ఎస్) పర్యావరణ, సామాజిక, ఆర్థిక, జీవవైవిధ్యం సమాచారం సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి సహాయపడతాయి.

పర్యావరణ సున్నితత్వం లేదా బలహీనత్వం అనేది శాశ్వత మరియు మరపురాని జీవన రూపాల నష్టాన్ని లేదా ఒక ప్రాంతం యొక్క సహజ పర్యావరణ సమగ్రత, పరిణామ ప్రక్రియలకు గణనీయమైన నష్టాన్ని సూచిస్తుంది. ఒక ప్రాంతం యొక్క పర్యావరణ సున్నితత్వం/బలహీనత్వం యొక్క సమగ్ర జ్ఞానం ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి చాలా అవసరం. అలాంటి కొన్ని వ్యూహాలు - ప్రకృతి దృశ్య గతిశీలతతో సహా పర్యావరణ సున్నితత్వానికి బాధ్యత వహించే కారకాలను గుర్తించడం మరియు ప్రమాదకరమైన మరియు అనియంత్రిత అభివృద్ధి విధానాల సమస్యలను తగ్గించడానికి భవిష్యత్ పరివర్తనాలను దృశ్య రూపంలో చూపడం.
పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణతో ప్రణాళికా రహిత అభివృద్ధి కార్యకలాపాల కారణంగా గత శతాబ్దంలో ఈ ప్రాంతానికి పెను భూ మార్పులు సంభవించాయి. దీనివల్ల స్థాన-నిర్దిష్ట పరిరక్షణ చర్యల ద్వారా ప్రభావాలను పరిష్కరించడానికి వాటాదారులను పాల్గొనే ఉపశమన చర్యలను అమలు చేయడం అవసరం. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలను పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి విధానాలు సామాజిక-పర్యావరణ వ్యవస్థలు, ప్రభావాలును సూచించే జీవ-భౌగోళిక-వాతావరణ, పర్యావరణ, మరియు సామాజిక కారకాలను సమగ్రపరచడం ద్వారా వివరించబడతాయి. 36 ప్రపంచ జీవవైవిధ్య హాట్-స్పాట్లలో ఒకటైన పశ్చిమ కనుమలలో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల రిమోట్ సెన్సింగ్ మరియు సమయానికి సంబంధించిన సమాచారం విశ్లేషణలు, అడవులు యొక్క ప్రస్తుత స్థితి మరియు వాటి పరిరక్షణ విధానాలపై తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ స్వచ్ఛమైన పర్యావరణ వ్యవస్థల యొక్క దుర్వినియోగం వల్ల కలిగే అటవీ నిర్మూలన మరియు నీటి భద్రత ముప్పు భారతదేశంలో ప్రజల జీవనోపాధికి తీవ్రమైన సవాళ్లను కలిగిస్తున్నాయి.
భూమి వినియోగం యొక్క స్థల-కాల విశ్లేషణలు మానవజన్య ప్రేరిత అభివృద్ధి వల్ల 4.5% నిర్మాణ మరియు 9% వ్యవసాయ ప్రాంతం పెరుగుదలతో 5% సతత హరిత అటవీ విస్తరణ కోల్పోతోంది. విచ్ఛిన్న-విశ్లేషణ అంతర్గత అటవీ ప్రాంతం అటవీ భూభాగంలో 25% మాత్రమే అని గుర్తిస్తుంది, ఇది విచ్ఛిన్న-ఒత్తిడిని వర్ణిస్తుంది మరియు ఇది స్థానిక పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. “ఈఎస్ఆర్” (ESR) అజీవ, జీవ మరియు సామాజిక/మానవ శాస్త్ర కారకాలను పరిశీలిస్తుంది, ఇది సున్నితంగా ఉండే ప్రకృతి యొక్క ప్రస్తుత స్థితిని మరియు పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. గ్రిడ్ వైజ్ విశ్లేషణ ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
1) ఈ ప్రాంతంలో 32% (755 గ్రిడ్లు) ఈఎస్ఆర్ -1 కింద ఉన్నాయి, ఇది చాలా అధిక పర్యావరణ బలహీనత్వాన్ని సూచిస్తుంది,
2) ఈఎస్ఆర్ 2 కింద 16% (373) గ్రిడ్లు, ఇది ఈఎస్ఆర్ 1గా మారే అవకాశం ఉంది,
3) 34% (789) ఈఎస్ఆర్-3 కింద, 18% (412) ఈఎస్ఆర్-4 కింద, మధ్యస్థ మరియు తక్కువ పర్యావరణ బలహీనత్వాన్ని సూచిస్తుంది.
ఈఎస్ఆర్ విశ్లేషణ 63,148 కిమీ2 ప్రాంతాన్ని చాలా ఎక్కువ, 27,646 కిమీ2 ప్రాంతాన్ని ఎక్కువ, 48,490 కిమీ2 ప్రాంతాన్ని మధ్యస్థంగ మరియు 20,716 కిమీ2 ప్రాంతాన్ని తక్కువ పర్యావరణ బలహీననంగాతో వర్ణిస్తుంది. సుస్థిర అభివృద్ధి విధాన చట్టంలో ఈఎస్ఆర్ (ESR) లను ఏకీకృతం చేయడం ద్వారా ప్రణాళిక లేని అభివృద్ధి కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ప్రజల జీవనోపాధిని కొనసాగించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ సేవల కొనసాగింపుతో, పర్యావరణ భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇది సహజ వనరుల (తగినంత మరియు శుభ్రమైన నీరు, ఆక్సిజన్ మొదలైనవి) సంరక్షిస్తూ తదుపరి తరానికి (తరాల మధ్య సమానత్వం) అందజేయడానికి వివేకవంతమైన పర్యావరణ నిర్వహణకు దోహద పడ్తుంది. పశ్చిమ కనుమలు రక్షణ మన భుజస్కంధాల పై ఉన్నాయి మరియు మన పిల్లలకు క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలను మనమందరం కలిసి పరిరక్షిద్దాం.

ద్వారా అనువదించబడింది సి వై కె ప్రసాద్
Translated by C. Y. K. Prasad


Research Team (Data Compilation)

G.R. Rao Field Data Collection
Central Western Ghats
Vishnu D. Mukri
Shrikanth Naik
Misha Fauna Distribution
Sreelekha P.B Angiosperm Tree Species
Haritha N Mapping Biodiversity
Arjun SR Protected Areas
Sincy V Valuation of Ecosystem Services
Asulabha KS
Rajesh Rana Western Ghats Villages Rectification


Developer Team

Abhishek Baghel Appplication Design & Developer


E-mail    |    Sahyadri    |    ENVIS    |    GRASS    |    Energy    |      CES      |      CST      |    CiSTUP    |      IISc      |    E-mail